Cheddi Gang Tamasha: ‘చెడ్డీ గ్యాంగ్‌ తమాషా’ వచ్చేస్తోంది

29 Jan, 2023 10:45 IST|Sakshi

వెంకట్‌ కళ్యాణ్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘చెడ్డీ గ్యాంగ్‌ తమాషా’. గాయత్రీ పటేల్‌ హీరోయిన్‌. అబుజా, శ్రీలీల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై సీహెట్‌ క్రాంతి కిరణ్‌ నిర్మించిన ఈ చిత్రం  సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఫిబ్రవరి రెండవ వారం లో రిలీజ్ కానుంది. 

ఈ సందర్భంగా నిర్మాత సిహెచ్ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. మా చెడ్డీ గ్యాంగ్ తమాషా టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకులను నుంచి మంచి స్పందన వచ్చింది. ‘ బిజినెస్ పరంగా కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి రెండవ వారంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు