అంతకు మించి...

5 Jan, 2021 06:40 IST|Sakshi

తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయం సాధించిన హారర్‌ కామెడీ చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కింది. ‘చితక్కొట్టుడు 2’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 7న థియేటర్లలో విడుదల కానుంది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన సంతోష్‌ పి. జయకుమార్‌ ఈ సీక్వెల్‌ను డైరెక్ట్‌ చేయడమే కాకుండా హీరోగా నటించారు. ఎస్‌. హరి భాస్కర్‌ నిర్మించిన ఈ సినిమాలో మీనల్, కరీష్మ, ఆకృతీ సింగ్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ‘‘మొదటి భాగాన్ని మించి ఈ సీక్వెల్‌ ఉంటుంది. కొత్త ఏడాదిలో ప్రేక్షకులను కనువిందు చేసే చిత్రమిది’’ అన్నారు సంతోష్‌ పి. జయకుమార్‌.

మరిన్ని వార్తలు