ఆక‌ట్టుకున్న `చెలియా` మ్యూజిక్ వీడియో

22 Jun, 2022 12:30 IST|Sakshi

సందీప్ అశ్వ, పూజారెడ్డి జంటగా, ఇన్నోస్పైర్ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన  ‘చెలియా’ మ్యూజిక్‌ ఆల్బమ్‌ విడుదలైంది. ఈ పాటకి సురేష్ బనిశెట్టి లిరిక్స్‌ అందించగా, మనోజ్‌ కుమార్‌ చేవూరి ఆలపించడంతో పాటు సంగీతం అందించారు. ప్ర‌కృతి అందాల మ‌ధ్య సాగే ఈ పాట వినసొంపుగా ఉంది.

‘అదేంటోగానీ. గుప్పెడు గుండె తిప్ప‌లు పెట్టే..నీ మైకంలో దిగిపోయా.. చెలియా.. ఏం చేశావో మాయా.. చెలియా.. నీ న‌వ్వుకూ బానిస‌న‌య్యా.... అంటూ సంద‌ర్భానుసారంగా `చెలియా..` అంటూ హై పిచ్‌లో పాడే పాట శ్రోత‌ల్ని మంత్ర‌ముగ్థుల్ని చేస్తుంది.  పాట‌కు అనుగుణంగా వాట‌ర్‌ఫాల్స్‌, మ‌ధ్య మ‌ధ్య‌లో ఇద్ద‌రి డైలాగ్‌లు, చూపుల‌తో ప్రేమ‌ను వ్య‌క్తీక‌రించ‌డం వంటివి యూత్‌ను అల‌రిస్తాయి. అడుగ‌డుగునా ఆనందాలే.. అన్న‌ట్లుగా సినిమాటోగ్రాఫ‌ర్ ద‌ర్శ‌కుడు అయిన  మణి కుమార్ గూడూరు అంతే చ‌క్క‌గా కెమెరాలో బంధించారు.

మరిన్ని వార్తలు