రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ 

24 Feb, 2024 05:50 IST|Sakshi
విజయ్‌ ఆంటోనీ, మృణాళిని రవి 

‘బిచ్చగాడు’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్‌ ఆంటోనీ. ఆయన హీరోగా తెరకెక్కుతున్న తాజా తమిళ చిత్రం ‘రోమియో’. వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మృణాళినీ రవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. మీరా విజయ్‌ ఆంటోనీ సమర్పణలో విజయ్‌ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్‌పై విజయ్‌ ఆంటోనీ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం తెలుగులో ‘లవ్‌ గురు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భరత్‌ ధనశేఖర్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చెల్లెమ్మవే చెయ్యి పట్టుకోవే..’ అంటూ సాగే పాటని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ సాంగ్‌కి భాష్యశ్రీ సాహిత్యం అందించగా, ఆదిత్య ఆర్కే పాడారు. ‘‘విజయ్‌ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ జానర్‌లో నటిస్తున్న చిత్రం ‘లవ్‌ గురు’. ఇందులో మనసుని కదిలించే చెల్లెలి సెంటిమెంట్‌ కూడా ఉంటుంది. వేసవిలో ఈ చిత్రం విడుదల చేయనున్నాం’’ అన్నారు మేకర్స్‌. ఈ చిత్రానికి కెమెరా: ఫరూక్‌ జే బాష.

whatsapp channel

మరిన్ని వార్తలు