Hero Vijay:‘దళపతి’ విజయ్‌ కేసును ముగించిన హైకోర్టు  

16 Jul, 2022 08:36 IST|Sakshi

సినీ హీరో విజయ్‌కి చెందిన కారు టాక్స్‌ కేసులో మద్రాస్‌ హైకోర్టు తీర్పు వెలువరించింది. 2019 జనవరి నాటికి ఎంట్రీ టాక్స్‌ చెల్లించకపోతే జరిమానా చెల్లించాల్సిందేనని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే నటుడు విజయ్‌ 2005లో రూ. 63 లక్షల ఖరీదైన కారును విదేశం నుంచి దిగుమతి చేసుకున్నారు. అయితే దీనికి రాష్ట్ర ఎంట్రీ టాక్స్‌ను చెల్లించకపోవడంతో వివాదానికి దారి తీసింది. వాణిజ్యశాఖాదికారులు ఎంట్రీ టాక్స్‌ను చెల్లించాలంటూ విజయ్‌కు నోటీసులు జారీ చేశారు. దీనిపై విజయ్‌ చెన్నై హైకోర్టును ఆశ్రయించారు.

చదవండి: వాళ్లు ఉన్నంత కాలం సినీ పరిశ్రమ మునిగిపోతుంది: డైరెక్టర్‌

సాధారణంగా కారును దిగుమతి చేసుకున్న నెల నుంచి రెండు శాతం జరిమానా మాత్రమే చెల్లించాల్సి ఉండగా తన కారుకు 40 శాతం జరిమానా విధించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై పలు మార్లు కోర్టులో విచారణ జరిగింది. కాగా గురువారం న్యాయమూర్తి సురేశ్‌ కుమార్‌ తుది తీర్పును వెల్లడించారు. అందులో విదేశం నుంచి దిగుమతి చేసుకున్న కారుకు 2019 జనవరిలోగా విజయ్‌ పూర్తిగా ఎంట్రీ టాక్స్‌ చెల్లించినట్లయితే జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదని, చెల్లించని ఎడల జరిమానా చెల్లించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేస్తూ.. కేసు విచారణను ముగించారు.   

మరిన్ని వార్తలు