దళితులపై అనుచిత వ్యాఖ్యలు.. నటి అరెస్ట్‌

9 Aug, 2021 17:34 IST|Sakshi

చెన్నై: తమిళ నటి, బిగ్‌ బాస్‌ ఫేం మీరా తన విచిత్రమైన వ్యవహర శైలితో తరచూ వార్తల్లో నిలిచే సంగతి తెలిసిందే. ఇతర నటీనటులు, ప్రముఖ రాజకీయ నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్‌టాపిక్‌గా మారుతుంటారు. సెలబ్రిటీల గురించి అంటే పర్లేదు కానీ ఈ సారి ఏకంగా ఓ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మీరా మిథున్‌ని చెన్నై పోలీసులు అరెస్ట్‌ చేశారు.

దళిత-కేంద్రీకృత పార్టీ అయిన విదుతలై సిరుతైగల్ కట్చి నాయకుడు వన్నీ అరసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటిని అరెస్ట్‌ చేశారు. కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల ప్రకారం మీరా మిథున్‌ దళితుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోను శనివారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇది కాస్త వైరల్‌ కావడంతో మీరా మిథున్‌ను అరెస్ట్‌ చేయాల్సిందిగా నెటిజనులు డిమాండ్‌ చేశారు. 

మీరా మిథున్‌ షేర్‌ చేసిన వీడియోలో.. ఆమె ఓ డైరెక్టర్‌ అనుమతి లేకుండా తన ఫోటోని అతడి మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కోసం వాడుకున్నాడని ఆరోపించారు. అంతటితో ఊరుకోక.. ‘‘తక్కువ జాతి అనగా దళిత సామాజిక వర్గానికి చెందిన వారి ఆలోచనలు ఇలానే ఉంటాయి. చాలా చీప్‌గా ప్రవర్తిస్తారు’’ అంటూ నోటికొచ్చినట్లు విమర్శించారు. దళితులు నేరాలకు, అంసాఘిక కార్యకలపాలకు పాల్పడటం వల్లనే వారిని సమాజంలో నీచంగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాక తమిళ ఇండస్ట్రీలో ఉన్న దళిత దర్శకులను, నటీనటులను బయటకు గెంటేయాలని సూచించారు. 

ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజనులు మీరా మిథున్‌సై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై పోలీసులు మీరా మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్‌ చేశారు. ఇక మీరా తమిళ్‌ బిగ్‌బాస్‌ సీజన్‌3లో పాల్గొన్నారు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు