ఒక మాతృభాష కథ

15 Nov, 2022 04:13 IST|Sakshi
ఆర్బీ చౌదరి, యష్‌ పూరి, స్టెఫీ పటేల్, అరుణ్‌ భారతి, అంజన్‌

‘‘సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌లో చాలామంది నటీనటులు, సాంకేతిక నిపుణులను పరిచయం చేశాం. ఇప్పుడు ‘చెప్పాలని ఉంది’ తో యష్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాం. యూనిక్‌ సబ్జెక్ట్‌తో రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని నిర్మాత ఆర్బీ చౌదరి అన్నారు. యష్‌ పూరి, స్టెఫీ పటేల్‌ ప్రధాన పాత్రల్లో అరుణ్‌ భారతి ఎల్‌.దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెప్పాలని ఉంది’. ‘ఒక మాతృభాష కథ’ అనేది ఉపశీర్షిక. ఆర్బీ చౌదరి సమర్పణలో  సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘చెప్పాలని ఉంది’. వాకాడ అంజన్‌ కుమార్, యోగేష్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 9న రిలీజ్‌ కానుంది.

ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలలో ఆర్బీ చౌదరి మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథలని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అందుకే ఈ చిత్రాన్ని ముందుగా తెలుగులోనే తీశాం. ఆ తర్వాత తమిళ్‌తో పాటు మిగతా భాషల్లో రీమేక్‌ చేస్తాం’’ అన్నారు. ‘‘యాక్షన్, రొమాన్స్, కామెడీ అంశాలున్న చిత్రమిది’’ అన్నారు యష్‌ పూరి. ‘‘ఈ సినిమా చూశాను.. చాలా బాగుంది’’ అన్నారు నిర్మాత వాకాడ అప్పారావు. ‘‘చెప్పాలని ఉంది’ కి ప్రేక్షకుల సహకారం ఇవ్వాలి’’ అన్నారు అరుణ్‌ భారతి. ఈ వేడుకలో హమ్స్‌ టెక్‌ ఫిలిమ్స్‌ యోగేష్, మాటల రచయిత విజయ్‌ చిట్నీడి మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌పీ డీఎఫ్టీ, సంగీతం: అస్లాంకీ.    

మరిన్ని వార్తలు