నాలుగు జంటల కథ

20 Sep, 2020 06:02 IST|Sakshi

శ్రీజిత్‌ హీరోగా, శిల్పా దాస్, నిష్కల హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చెరసాల’. రాంప్రకాష్‌ గుణ్ణం దర్శకత్వంలో మాదినేని సురేష్, సుధారాయ్‌ గుణ్ణం నిర్మించిన ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ని నిర్మాత రాజ్‌ కందుకూరి, టైటిల్‌ లోగోని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. రాంప్రకాష్‌ గుణ్ణం మాట్లాడుతూ– ‘‘లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషనల్‌ డ్రామాకి హారర్‌ ఎలిమెంట్‌ని మిళితం చేసి ఈ చిత్రాన్ని రూపొందించాం. నాలుగు జంటల మధ్య సాగే కథ ఇది’’ అన్నారు. ‘‘మా సినిమా రష్‌ చూసుకున్నాక చెప్పిన దానికంటే దర్శకుడు చాలా బాగా తీశాడని అర్థమైంది. మొదటి ప్రాజెక్ట్‌తోనే మంచి విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది’’ అన్నారు మాదినేని సురేష్‌. ఈ చిత్రానికి సంగీతం: శంకర్‌ తమిరి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా