Cheruvaina Dooramaina: సుజిత్‌కి మంచి భవిష్యత్ ఉంది : అనిల్‌ రావిపూడి

15 Aug, 2021 18:34 IST|Sakshi

కమెడియన్‌ శ్రీనివాస్‌ రెడ్డి మేనల్లుడు సుజిత్ రెడ్డి, తరుణి సంగ్ జంటగా నటించిన చిత్రం ‘చేరువైన... దూరమైన’.చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నివినాయక ఎంటర్టైన్ మెంట్ పతాకంపై కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని ప్రముఖ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి విడుదల చేశారు.  ఈ సందర్భంగా అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. ట్రైలర్‌ చాలా బాగుందని, ఈ సినిమా తప్పకుండా హిట్‌ అవుతుందని తెలిపారు. సుజిత్ కి మంచి భవిష్యత్ ఉంటుదన్నారు.  

దర్శకుడు చంద్రశేఖర్ ​మాట్లాడుతూ.. ‘హీరో సుజిత్ తో నాకు చాలా అనుబంధం వుంది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందు ఓ మూడు నిమిషాల నిడివిగల ఓ డెమో సన్నివేషాన్ని తీసి సుజిత్ వాళ్ల అమ్మకు చూపించాం. ఆమె ఎంతో ఆనందించారు. నన్ను నమ్మి వాళ్ల అబ్బాయిని నా చేతిలో పెట్టారు. సుజిత్ లో ఆనందం కంటే... వాళ్ల అమ్మ కళ్లలో ఆనందమే చూడాలనుకున్నా. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాను చిత్రీకరించాం. ఆ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది’అన్నారు.

నిర్మాత కంచర్ల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ..‘శ్రీనివాసరెడ్డి అన్న మా వెన్నంటి వుండి ఈసినిమాను ఎంతో ప్రోత్సహించారు. ఆయన కొన్ని సందేహాలు వెలిబుచ్చినా...ఈ సినిమాను దర్శకుడు ఎంతో పట్టుదలతో కంప్లీజ్ చేశారు చంద్రశేఖర్ తాను చెప్పిన కథ ఏదైతో వుందో దానినే తీశారు. ఈ రోజు టీజర్, ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతోంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఇష్టపడతారు’అని అన్నారు.  ‘నా మేనల్లుడిని ఆశీర్వదించండి’అని ప్రేక్షకులను కోరారు కమెడియన్‌ శ్రీనివాస్‌ రెడ్డి. ఈ కార్యక్రమంలో విలన్ గా నటించిన శశి, రచయిత సురేష్, బట్టు అంజిరెడ్డి, జిట్టా సురేందర్ రెడ్డి, దండెం రాజశేఖర్ రెడ్డి, ప్రముఖ దర్శకుడు వెంకీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు