పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో 'చెష్మా రాజా సెల్ఫీ రాణి'

9 Sep, 2021 23:51 IST|Sakshi

భయపెడుతూ, నవ్విస్తూ... ఫుల్ ఎంటర్టైన్ చేసే జోనర్‌ ఏదైనా ఉందంటే అది హారర్‌ మూవీనే. అందుకే టాలీవుడ్‌లో వచ్చిన హారర్‌ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు అదే హారర్‌ జానర్‌లో మరో సినిమా ఆడియన్స్‌ను అలరించనుంది.

రాగిణి క్రియేషన్స్ బ్యానర్‌పై వీరేంద్ర‌బాబు హీరోగా 'చెష్మా రాజా సెల్ఫీ రాణి'  గౌత‌మ్ కృష్ణ‌న్ డైరక్టర్‌ గా పి.శ్రీనివాసరావు, రామ్ అవధానంలు  నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. హారర్ కామెడీ జోన‌ర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. 

ఈ సంద‌ర్భంగా...నిర్మాత‌లు పి.శ్రీనివాసరావు, రామ్ అవధానం మాట్లాడుతూ 'ఈ చిత్రంతో వీరేంద్ర‌బాబుని హీరోగా ప‌రిచయం చేస్తున్నాం. హార్రర్ కామెడీ జోనర్ మూవీ. డైరెక్ట‌ర్ గౌత‌మ్ కృష్ణ‌న్ సినిమాను చాలా బాగా తెర‌కెక్కించారు.షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోందీ సినిమా. అలాగే ఘ‌న‌శ్యామ్ మ్యూజిక్ ఎక్స్‌ట్రార్డిన‌రీ ఉంటుంది. ఇందులో ప్రేమ్ ర‌క్షిత్ కంపోజ్ చేసిన ఓ సాంగ్ చిత్రానికే హైలెట్‌గా నిలుస్తుందని ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ సంచిత పాణిగ్రహీతో పాటు గౌతమ్ రాజు, జబర్దస్త్ రాజమౌళి, రామ్ అవధానం, నైమిష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి త్వ‌ర‌లోనే సినిమాను విడుద‌ల తేదీని అనౌన్స్ చేస్తాం' అని అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు