హీరోగా మారిన రాజుగారి గది నటుడు.. గ్రాండ్‌గా లాంచింగ్‌

11 Mar, 2023 15:20 IST|Sakshi

‘రాజుగారి గది, మంత్ర 2, విద్యార్థి, జెంటిల్‌ మేన్‌ 2’ వంటి చిత్రాల్లో నటించిన చేతన్‌ శీను హీరోగా ‘భీష్మ పర్వం’ సినిమా రూపొందుతోంది. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రోషిని సహోతా కథానాయిక. ప్రేమ్‌ కుమార్, చేతన్‌ శీను నిర్మాతలు.

తొలి సీన్‌కి బెక్కం వేణుగోపాల్‌ క్లాప్‌ కొట్టగా, ఎర్రవెల్లి భాస్కర్, ఎర్రవెల్లి ప్రవీణ్, తరణి భాస్కర్, జయశంకర్‌ కెమెరా స్విచ్చాఫ్‌ చేశారు. ‘‘ఈ చిత్రం కోసం వేసిన 40 అడుగుల కాళీ మాత సెట్‌లో వంద మంది ఫైటర్లతో భారీ యాక్షన్సీ‌న్స్‌ చిత్రీకరిస్తాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు.

మరిన్ని వార్తలు