‘భేదియా’ మూవీ నుంచి చిలిపి వరాలే ఇవ్వు సాంగ్‌ రిలీజ్‌

8 Nov, 2022 09:01 IST|Sakshi

వరుణ్‌ ధావన్, కృతీ సనన్‌ జంటగా అమర్‌ కౌశిక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భేదియా’. దినేష్‌ విజన్‌ నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళంలో ఈ నెల 25న విడుదలకానుంది. నిర్మాత అల్లు అరవింద్‌ ‘భేదియా’ని తెలుగులో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ద్వారా రిలీజ్‌ చేస్తున్నారు.

సచిన్‌ జిగర్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చిలిపి వరాలే ఇవ్వు..’ అంటూ సాగే వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. అమితాబ్‌ భట్టాచార్య–యనమండ్ర రామకృష్ణ సాహిత్యం అందించిన ఈ పాటని కార్తీక్‌ పాడారు. ‘‘హారర్, కామెడీ చిత్రమిది. ‘చిలిపి వరాలే ఇవ్వు..’ పాట చాలా బాగుంటుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు