షాకింగ్‌ రెమ్యూనరేషన్‌.. రోజుకు రూ.2కోట్లు

30 Apr, 2021 20:23 IST|Sakshi

సినిమా తారల సంపాదన గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆసక్తే. ఓ సగటు మనిషి తన జీవిత కాలం అంతా కష్టపడినా సంపాదించని మొత్తం వారు ఒక్క సినిమాతో సంపాదిస్తారు. కొందరు నటులు ఒక్క రోజులో కోట్లు సంపాదిస్తారంటే అతిశయోక్తి కాదు. మన దగ్గర స్టార్‌ హీరోలు ఒక్క సినిమాకు 50 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ టాపిక్‌ ఎందుకంటే తాజాగా ఓ నటి తీసుకున్న పారితోషికం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆమె రెమ్యూనరేషన్‌ తెలిసి జనాలు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు.

వివరాలు చైనా నటి జెంగ్‌ ఓ షో కోసం రోజుకు 3,20,000 డాలర్ల(రూ.2,36,76,816) చొప్పున 77 రోజులకు కలిపి 25 మిలియన్‌ డాలర్ల(1,84,97,88,750 కోట్ల రూపాయలు) రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్లు తెలిసింది. అయితే ఈ మొత్తాన్ని 2019లో ఓ కాస్ట్యూమ్ డ్రామాలో నటించేందుకు 77 రోజులు కేటాయించిన నటి.. రోజుకు 3,20,000 డాలర్లు తీసుకుందని మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో ప్రచురితమైంది.

ఈ క్రమంలో అధిక వేతనం అందుకున్న జెంగ్‌.. పన్ను ఎగవేతకు పాల్పడిందన్న ఆరోపణలతో షాంఘై, బీజింగ్‌లోని అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు చైనా మీడియా కథనాలు వెలువరించింది. ఈ వార్తలపై స్పందించిన సదరు నటి తాను ఇన్వెస్టిగేషన్‌కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. కాగా ఈ విషయాన్ని జెంగ్ ఎక్స్ పార్ట్‌నర్, టెలివిజన్ ప్రొడ్యూసర్ జాంగ్ హెంగ్ బయటపెట్టాడు. తన షో కోసమే నటి ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేసినట్లు తెలిపాడు.

చదవండి: టీజర్‌ హిట్‌.. రెమ్యునరేషన్‌ పెంచిన బాలయ్య

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు