వెండితెరపై సందడి చేయబోతున్న రియల్‌​ కపుల్‌

10 Sep, 2021 16:09 IST|Sakshi

అక్కినేని వారసుడు అఖిల్‌ అక్కినేని, బుట్టబొమ్మ పూజా హెగ్డేలు జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. ల‌వ్ అండ్‌ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 8న విడుదల కాబోతుంది. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ గాయనీ చిన్మయి సందడి చేయబోతున్నారు. ఈ రోజు(సెప్టెంబర్‌ 10) ఆమె పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్‌ తన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

చదవండి: ‘ఆ రెండు సినిమాలు తీయకపోతే నా జీవితానికి అర్థం లేదు’ 

ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ చిన్మయికి విషెస్‌ కూడా తెలిపారు. అలాగే ఈ సినిమాలో ఆమె భర్త, నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వీరిద్దరూ కీలక పాత్రలు పోషించనున్నారట. అయితే జంటగానా, వీడిగానా అనేది క్లారిటీ లేదు. కానీ ఈ రీయల్‌​ కపుల్‌ మాత్రం రీల్‌పై తొలిసారిగా సందడి చేయడం విశేషం. దీంతో వారి ఫ్యాన్స్‌ వారి పాత్రలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ఇంతకాలం తెరవెనక తన గొంతులో ప్రేక్షకులను, సంగీత ప్రియులను ఆకట్టుకున్న చిన్మయి ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ మూవీతో తెరపై అలరించబోతున్నారు. కాగా చిన్మయి స్టార్‌ హీరోయిన్‌ సమంతకు డబ్బింగ్‌ చెబుతున్న విషయం తెలిసిందే.

చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ప్రముఖ లేడీ కమెడియన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు