Chinmayi Sripada: నయనతార లుక్స్‌పై ట్రోలింగ్‌.. మండిపడ్డ చిన్మయి

24 Dec, 2022 16:54 IST|Sakshi

సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోన్న నయనతార సినిమా ప్రమోషన్స్‌కు రావడం చాలా అరుదు. కానీ ఈసారి మాత్రం తను నటించిన కనెక్ట్‌ సినిమా కోసం ఇంటర్వ్యూ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే భర్త విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి ఇటీవలే కనెక్ట్‌ ప్రీమియర్‌ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేశాయి. దీనిపై పలువురు నెటిజన్లు అసభ్య కామెంట్లు చేశారు. పెళ్లై పిల్లలున్నా కూడా ఇంకా అలాగే ఉందేంటని ప్రశ్నించారు. తన బాడీ షేప్‌ గురించి కూడా నోటికొచ్చిందని వాగారు.

ఈ అనుచిత కామెంట్లపై సింగర్‌ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఇలాంటి పురుషులు ఇంట్లో ఉంటే మహిళలు వారి కన్నబిడ్డలకు కూడా చున్నీ వేసే తిప్పాలేమో.. ఎందుకంటే పురుషుడు అతడి ఫీలింగ్స్‌ ఆపుకోలేడు కదా.. తండ్రైనా, సోదరుడైనా ఇంట్లో ఆడపిల్లను కూడా అలాంటి దుర్బుద్ధితోనే చూస్తాడేమో' అని ఆగ్రహించింది. మహిళలందరూ తమ ఆడపిల్లలను ఇలాంటి పురుషులకు దూరంగా ఉంచాలని, వాళ్ల వల్ల ఎటువంటి సంరక్షణ ఉండదని మండిపడింది.

చదవండి: గర్భవతయ్యాక సడన్‌గా పెళ్లి? నటి ఏమందంటే?
గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన నటుడు

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు