'TNR ఇంటర్వ్యూలతో వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా ఓ మెట్టు ఎదిగా'

11 May, 2021 20:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ యాంకర్‌, నటుడు, జర్నలిస్టు టీఎన్‌ఆర్‌ కుటుంబానికి మెగాస్టార్‌ చిరంజీవి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. టీఎన్‌ఆర్‌ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి ఫోన్‌లో టీఎన్‌ఆర్‌ కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఇక మరో నటుడు సంపూర్ణేష్‌ బాబు 50వేల రూపాయల అర్థిక సహాయం చేశారు. టీఎన్‌ఆర్‌ ఇంటర్వ్యూల ద్వారా వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా తాను ఓ మెట్టు ఎదిగానని, వారి కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, తనవంతు సహాయం తప్పకుండా చేస్తానని పేర్కొన్నారు. కాగా కరోనా కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ టీఎన్‌ఆర్‌ కన్నుమూసిన సంగతి తెలిసిందే. 

ఫ్రాంక్లీ విత్‌ టీఎన్‌ఆర్‌ అనే షోతో ఎంతో పాపులర్‌ అయిన టీఎన్‌ఆర్‌ ఎంతో గుర్తింపు పొందారు. పేరునే బ్రాండ్‌గా మార్చుకొని తనదైన స్టైల్‌లో ప్రశ్నలడిగేవారు టీఎన్‌ఆర్‌. అందుకే ఆయనతో ఇంటర్వ్యూలంటే ఎంతోమంది ప్రముఖులు ఆసక్తి కనబరిచేవారు. అప్పటిదాకా ఎవరికి తెలియని విషయాలను సైతం అతిధుల నుంచి రాబట్టేవారాయన.రామ్‌ గోపాల్‌ వర్మ, తేజ, తనికెళ్ల భరణి వంటి సినీ ప్రముఖులతో 4 గంటల పాటు సుధీర్గంగా ఇంటర్వ్యూ చేసిన ఘనత టీఎన్‌ఆర్‌దే. తెలుగులో ఇంతవరకు ఎవరు కూడా అంత ఎక్కువసేపు ఇంటర్వ్యూ చేయలేదు. అంతటి ప్రత్యేకతను సంపాదించుకున్నారయన.

చదవండి : TNR : కన్నీళ్లు తెప్పిస్తున్న టీఎన్‌ఆర్‌ చివరి పాట
ఆ ఇంటర్వ్యూలతో టీఎన్‌ఆర్‌ దశ తిరిగింది..

మరిన్ని వార్తలు