Happy Birthday Chiranjeevi: అలా 'చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌' ఏర్పాటైంది..

22 Aug, 2021 07:48 IST|Sakshi

కష్టంలో ఉన్న బాధితులకు అండగా నిలబడటంలో ముందుటారు మెగాస్టార్‌ చిరంజీవి.  పలు సామాజిక కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి అండగా నిలుస్తున్నారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నారు. అసలు ఈ బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలనే అలోచన ఎలా వచ్చింది? దీనికి గల కారణాలు ఏంటి అన్నదానిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ రోజు పేపర్‌ చదువుతుంటే, రక్తం లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారనే వార్త కనిపించింది.
(చదవండి: బర్త్‌డే స్పెషల్‌ : చిరు 153 మూవీ టైటిల్‌ వచ్చేసింది..)

ఇంతమంది జనం ఉండి కూడా సరైన సమయానికి రక్తం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ఏంటి అన్న ప్రశ్న నన్ను ఎంతగానో తొలచివేసింది. దీంతో ఆ మరుసటి రోజు బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేశాను. అలా 1998లో చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ను స్థాపించాం. నా ప్రయత్నానికి ఎంతోమంది అభిమానులు సహా సామాన్యులు కదిలివచ్చారు. అలా వారందరి సహకారంతో ఎంతో సక్సెస్‌ ఫుల్‌గా బ్లడ్‌ బ్యాంక్‌ను నిర్వహిస్తున్నాం అని చిరు పేర్కొన్నారు.

కాగా బ్లడ్‌ బ్యాంక్‌తో పాటు ఐ బ్యాంక్‌లను ఏర్పాటు చేసిన చిరంజీవి ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నాడు. అలాగే కోవిడ్‌ సమయంలో ఆక్సిజన్‌ లేక చాలా మంది ప్రాణాలు కోల్పోవడం చూసి  చలించిపోయిన చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో ఓ ఆక్సిజన్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా త్వరలోనే అంబులెన్స్ సర్వీసులను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు