ఆచార్య ‘లాహే లాహే’ సాంగ్ తెలుగు లిరిక్స్.. మీ కోసం‌

12 Apr, 2021 12:35 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నిరంజన్‌  రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. రామ్‌ చరణ్ ‌ఈ సినిమాను నిర్మించడంతో పాటు సిద్ధ అనే ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇటీలవ ఈ మూవీలోని ‘లాహే లాహే’ పాటను చిత్ర బృదం విడుదల చేసింది. ఈ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌ మారి.. అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఆ పాట తెలుగు లిరిక్స్‌ మీ కోసం.. 

పల్లవి: లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే ..
కొండలరాజు  బంగరుకొండ
కొండజాతికి అండదండ 
మద్దెరాతిరి లేచి మంగళ గౌరి 
మల్లెలు కోసిందే
వాటిని మాలలు కడతా మంచు కొండల 
సామిని తలసిందే .. !! లాహే లాహే !!

 చరణం: మెళ్ళో మెలికల నాగులదండ 
వలపుల వేడికి ఎగిరిపడంగా 
ఒంటి ఇబుది జల జల రాలిపడంగ 
సాంబడు కదిలిండే 
అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై 
విల విల నలిగిండే .. !! లాహే లాహే !!
 
చరణం:  కొర కొర కొరువులు మండే కళ్ళు 
జడలిరబోసిన సింపిరి కురులు 
ఎర్రటి కోపాలెగసిన  కుంకమ్‌ బొట్టు 
వెన్నెల కాసిందే 
పెనిమిటి రాకను తెలిసి సీమాతంగి 
సిగ్గులు పూసిందే
ఉబలాటంగా ముందటికురికి 
అయ్యవతారం చూసిన కలికి 
ఎందా సెంకం సూలం బైరాగేసం 
ఎందని సనిగిందె 
ఇంపుగా ఈపూటైన రాలేవా అని 
సనువుగా కసిరిందే ... !! లాహే లాహే !!

 చరణం:  లోకాలేలే ఎంతోడైన 
లోకువమడిసే సొంతింట్లోన 
అమ్మోరి గడ్డం పట్టి బతిమాలినవి 
అడ్డాల నామాలు 
ఆలుమగల నడుమన అడ్డంరావులె 
ఇట్టాటి నీమాలు 
ఒకటోజామున కలిగిన విరహం 
రెండోజాముకు ముదిరిన విరసం 
సర్దుకుపోయే సరసం కుదిరే యేలకు 
మూడో జామాయే 
ఒద్దిక పెరిగే నాలుగోజాముకు 
గుళ్లో గంటలు మొదలాయే... !లాహే లాహే !
ప్రతి ఒక రోజిది జరిగే గట్టం 
యెడముఖమయ్యి ఏకం అవటం   
అనాది అలవాటిల్లకి 
అలకలలోనే కిలకిలమనుకోటం 
స్వయానా చెబుతున్నారు 
అనుబంధాలు కడతేరే పాఠం 

సినిమా: ఆచార్య
సంగీతం: మణిశర్మ 
రచన: రామజోగయ్య శాస్త్రి
గానం: హారికా నారాయణ్, సాహితీ చాగంటి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు