ఆచార్య: డేట్‌ ఫిక్స్‌ చేయమంటున్న చిరు!

20 Jan, 2021 14:58 IST|Sakshi

'సైరా నరసింహారెడ్డి' తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వంలో చిరు హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌ చేసినట్లు కనిపిస్తోంది. గణతంత్ర దినోత్సవం నాడు టీజర్‌ విడుదల చేసి అభిమానులను సర్‌పప్రైజ్‌ చేయాలన్న ఆలోచనలో ఉందట చిత్రయూనిట్‌. పైగా ఆచార్య కథకు ఆ రోజు రిలీజ్‌ చేస్తేనే బాగుంటుందని సూచించారట మెగాస్టార్‌. ఇక ఖైదీ నంబర్‌ 150లో చిరుతో జోడీ కట్టిన చందమామ కాజల్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ కీలక పాత్రలో నటిస్తుండగా ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ ఇటీవలే మొదలైంది.

సైరా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని వస్తున్న సినిమా కావడంతో ఆచార్య టీజర్‌ గురించి ప్రేక్షక లోకం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. మరి ఈ టీజర్‌లో చిరుతో పాటు, చెర్రీని కూడా ఒకే దగ్గర చూపించారంటే సోషల్‌ మీడియాలో సునామీ రావడం ఖాయం. 'ట్రెండింగ్‌ ఏ రేంజ్‌లో చేయాలో మేము చూసుకుంటాం, మీరు జస్ట్‌ టీజర్‌ వదలండి చాలు' అంటూ అభిమానులు సంబరాలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారు. (చదవండి: బైక్‌పై భారీయాత్రకు సిద్ధమైన స్టార్ హీరో!)

కాగా ఆచార్య షూటింగ్‌ గతేడాది మార్చిలో సెట్స్‌ మీదకు వెళ్లగా లాక్‌డౌన్‌ వల్ల షూటింగ్‌ ఆలస్యం అయింది. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాను మే 9న రిలీజ్‌ చేయాలని ఆలోచిస్తున్నారట. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఓ పాటలో చిరు స్టెప్స్‌ అభిమానులతో ఈలలు కొట్టించేలా ఉన్నాయట. ఇక ఆచార్య తర్వాత చిరు మోహన్‌రాజా దర్శకత్వంలో 'లూసీఫర్'‌ రీమేక్‌లో నటించనున్నారు. పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రల్లో నటించనున్నారు. (చదవండి: జేమ్స్‌ బాండ్‌ 007 నటి మృతి)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు