Puneeth Rajkumar: పునీత్‌ ‘జేమ్స్‌’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు చీఫ్‌గెస్ట్‌గా టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు

26 Feb, 2022 17:38 IST|Sakshi

కన్నడ పవర్‌ స్టార్, దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం 'జేమ్స్' విడుదల సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. మార్చి 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండటంతో చిత్రం బృందం మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో మార్చి 6న ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు ప్లాన్‌ చేస్తున్నారు.

అయితే ఈ కార్యక్రమానికి అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన స్టార్‌ హీరోలు హజరవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథులుగా వెళ్తున్నట్లు సమాచారం. చిత్ర బృందం వీరిని ఆహ్వానించడంతో చిరు, తారక్‌ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా జూనియర్‌ ఎన్టీఆర్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. తారక్‌పై ఉన్న అభిమానంతో పునీత్‌ తన సినిమాలో స్పెషల్‌గా ఓ సాంగ్‌ కూడా పాడించుకున్నారు.

మరిన్ని వార్తలు