సైదాబాద్‌ ఘటన నిందితుడు ఆత్మహత్య: చిరంజీవి స్పందన

16 Sep, 2021 13:40 IST|Sakshi

సైదాబాద్ బాలిక హ‌త్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. స్టేషన్‌ఘన్‌పూర్‌ రైల్వే ట్రాక్‌పై రాజు శవమై కనిపించాడు. ఈ విషయం తెలిసి దీనిపై ప‌లువురు సినీ, రాజకీయ ప్ర‌ముఖులు స్పందిస్తున్నారు. తాజాగా హీరో మంచు మనోజ్‌ కూడా ఈ ఘటనపై స్పందించాడు. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేయగా.. ఆయన ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ.. ‘ఈ వార్త చెప్పినందుకు థ్యాంక్యూ స‌ర్.. దేవుడు ఉన్నాడు. ఓం శాంతి చైత్ర’ అంటూ మంచు మ‌నోజ్ స్పందించాడు. 

చదవండి: సైదాబాద్‌ చిన్నారి కేసు: నిందితుడు రాజు ఆత్మహత్య

అలాగే మెగాస్టార్‌ చిరంజీవి రాజు ఆత్మ‌హ‌త్య‌పై ట్వీట్‌ చేస్తూ.. రాజు త‌న‌ను తాను శిక్షించుకోవ‌డం బాధిత బాలిక కుటుంబ స‌భ్యుల‌తో పాటు అంద‌రికీ ఊర‌ట క‌లిగిస్తోంద‌ని చెప్పారు. బాలిక‌ల‌పై దారుణ ఘ‌ట‌న‌లు మ‌రోసారి జ‌ర‌గ‌కూడ‌ద‌ని, అందుకు ప్ర‌జ‌లు చొర‌వ‌చూపాల‌ని ఆయ‌న కోరారు. 

చదవండి: సైదాబాద్‌ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మంచు మనోజ్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు