Chiranjeevi : బ్రహ్మానందాన్ని సత్కరించిన చిరంజీవి, రామ్‌చరణ్‌

23 Mar, 2023 17:21 IST|Sakshi

ఆడియెన్స్‌ని తనదైన కామెడీ పాత్రలతో కడుపుబ్బా నవ్వించి ఆకట్టుకునే కమెడియన్‌ బ్రహ్మానందం. స్క్రీన్‌పై ఆయన ఒక్కసారి కనిపిస్తే చాలు, స్టార్‌ హీరోలకు ధీటుగా రెస్పాన్స్‌ వస్తుంటుంది. అయితే కెరీర్ లో తొలిసారిగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ మూవీలో ఒక సీరియస్ రోల్‌లో కనిపించారు బ్రహ్మానందం.

ఉగాది సందర్భంగా విడుదలైన రంగమార్తాండ మంచి మౌత్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా థియేటర్స్‌లో రన్ అవుతోంది. సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ బ్రహ్మానందం నటనకు ముగ్దులవుతున్నారు. ఇన్నాళ్లు మనల్ని నవ్వించిన బ్రహ్మానందం ఇలా ఏడిపించేశారు ఏంటి? అని అనుకుంటున్నారు.

థియేటర్లో బ్రహ్మానందం సీన్లకు ఆడియెన్స్‌ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతున్నారు. బ్రహ్మానందం నటించిన పాత్రకు ఇంత మంచి పేరు రావడంతో మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌ ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. శాలువాతో సత్కరించారు.

మరిన్ని వార్తలు