Bholaa Shankar First Look: ఊర మాస్‌గా చిరు.. లుక్‌ అదిరిందిగా

1 Mar, 2022 10:31 IST|Sakshi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భోళా శంకర్‌’. తమిళ సూపర్‌ హిట్‌ మూవీ వేదాళం తెలుగు రీమేక్‏ ఇది.  చిరంజీవి కెరీర్‏లో 154వ చిత్రంగా వస్తున్న ఈ మూవీలో హీరోయిన్‌గా తమన్నా, చిరు చెల్లెలిగా కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్‌ సంగీతం అందిస్తున్నారు.

మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. మెగా అభిమానులు వెండితెరపై చిరంజీవి ఎలా చూడాలనుకుంటున్నారో.. అలా ఈ ఫస్ట్‌ లుక్‌ ఉంది.  స్టైల్‌గా జీపుపై కూర్చొని ఊర మాస్‌ లుక్‌లో చిరంజీవి అదరగొట్టేశాడు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది

మరిన్ని వార్తలు