నాగబాబు బర్త్‌డే : చిరంజీవి భావోద్వేగ ట్వీట్‌

29 Oct, 2020 12:22 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడు, నటుడు, నిర్మాత నాగబాబు పుట్టిన రోజు నేడు(అక్టోబర్‌ 29). ఈ సందర్భంగా పలువురు సీనీ ప్రముఖులు నాగబాబుకు బర్త్‌డే విషెష్‌ తెలియజేస్తున్నారు. ఇక తన తమ్ముడికి సోషల్‌ మీడియా వెదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్‌ చిరంజీవి. ‘విధేయుడు, భావోధ్వేగం కలిగిన వాడు, ద‌యా హృద‌యుడు, స‌ర‌దా వ్యక్తి నా సోద‌రుడు నాగ‌బాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని, నీ ప్రతి పుట్టినరోజుకి  అది మరింత బలపడాల‌ని ఆశిస్తున్నాను అంటూ చిరంజీవి త‌న ట్వీటర్‌ ద్వారా బ‌ర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇద్దరు తమ్ముళ్లు పవన్‌, నాగబాబులతో కలిసి ఉన్న ఫోటోను షేర్‌ చేశాడు. ఇక అన్నయ్య బర్త్‌డే ట్వీట్‌కు స్పందించిన నాగబాబు..‘థ్యాంక్స్‌ అన్నయ్య.. నేనేప్పుడు నీతోడుగానే ఉంటా’ అంటూ రిప్లై ఇచ్చాడు. 
(చదవండి : పారితోషికం తీసుకోవడంలేదు)

అలాగే మెగా అల్లుడు, హీరో సాయిధరమ్‌ తేజ్‌ కూడా మామయ్య నాగబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడలు, కళలలోకి రావడంలో న‌న్నుప్రోత్స‌హించిన వారిలో నాగ‌బాబు ఒక‌రు. ఆయ‌న‌కు నా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను అని ట్వీట్ చేస్తూ నాగబాబుతో కలిసి దిగిన తన చిన్నప్పటి ఫోటోని షేర్‌ చేశాడు. అలాగే నాగబాబు కుమారుడు, హీరో వరుణ్‌ తేజ్‌, సినీ నిర్మాత బండ్ల గణేష్‌ తదితరులు సోషల్‌ మీడియా వేదికగా నాగబాబుకి బర్త్‌డే విషెష్‌ తెలియజేశారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు