ఆ దర్శకుడు నా స్టార్‌డమ్‌ పెంచారు: చిరంజీవి

23 May, 2021 13:13 IST|Sakshi

రాఘవేంద్రరావుకు మెగాస్టార్‌ బర్త్‌డే విషెస్‌

కె. రాఘవేంద్రరావు.. ఆయన తెరకెక్కించిన ఒక్కో చిత్రం ఒక్కో కళాఖండం. నటీనటులతో నవరసాలను ఒలికించడమే కాదు ప్రేక్షకులు దాన్ని ఫీల్‌ అయ్యేలా తెరకెక్కించడంలో ఆయన దిట్ట. నవతరం దర్శకులకు ఆదర్శప్రాయంగా నిలిచిన రాఘవేంద్రరావు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశాడు.

'రాఘవేంద్రరావు సినీప్రస్థానంలో అత్యధిక చిత్రాల కథానాయకుడిగా నాకు ఓ ప్రత్యేకత లభించింది. ఆ రకంగా మా కాంబినేషన్‌ ఎంతో స్పెషల్‌. నా స్టార్‌డమ్‌ను, కమర్షియల్‌ స్థాయిని పెంచాడీ దర్శకుడు. తెలుగు చిత్రాల్లో ఎప్పటికీ అపురూపంగా నిలిచే జగదేకవీరుడు.. లాంటి చిత్రాన్ని నాకు కానుకగా ఇచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుగారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను' అంటూ చిరంజీవి ట్వీట్‌​ చేశాడు.

చదవండి: పోలీసులను ఆశ్రయించిన సింగర్‌ మధు ప్రియ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు