సినీ కార్మికులందరికి ఉచితంగా వ్యాక్సిన్‌ : చిరంజీవి

8 Jun, 2021 01:01 IST|Sakshi

‘‘కరోనా క్రైసిస్‌ చారిటీ (సీసీసీ) ఆధ్వర్యంలో సినిమారంగంలోని 24 శాఖల వారికి, ఫిలిం ఫెడరేషన్, మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్, సినీ జర్నలిస్ట్‌లకు కోవిడ్‌ నివారణకు వ్యాక్సిన్‌ వేయిస్తున్నాం.. వ్యాక్సిన్‌ విషయంలో అపోహలు వీడండి.. నేను వ్యాక్సిన్‌ తీసుకున్నాను. తప్పకుండా అందరూ తీసుకుందాం.. కరోనా రాకుండా  చేద్దాం’’ అని హీరో చిరంజీవి అన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో సినిమా రంగంలోనివారికి వ్యాక్సిన్‌ వేయించే కార్యక్రమం హైదరాబాద్‌లోని చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో జరిగింది. ఈ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘నిజానికి మూడు వారాల క్రితమే ఈ డ్రైవ్‌ ప్రారంభించాం. అయితే వ్యాక్సిన్‌ అందుబాటులో లేకపోవడంతో గ్యాప్‌ వచ్చింది. ఇప్పటికే వేలమంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. రోజుకు ఐదారు వందల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు