Chiranjeevi: చిరంజీవి పేరు మార్చుకున్నారా ? అసలు కారణం ఇదే !

5 Jul, 2022 15:33 IST|Sakshi

Megastar Chiranjeevi: ప్రస్తుతం చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో గాడ్ ఫాదర్‌, భోళా శంకర్‌, వాల్తేరు వీరయ్య (ప్రచారంలో ఉన్న టైటిల్‌) చిత్రాలు ఉన్నాయి. సోమవారం (జులై 4) 'గాడ్ ఫాదర్‌' సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు చిన్నిపాటి వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి పేరు మార్చుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

సోమవారం విడుదలైన 'గాడ్‌ ఫాదర్‌' ఫస్ట్‌ లుక్‌ గ్లింప్స్‌లో చిరంజీవి పేరు ఇంగ్లీషు లెటర్స్‌లో అదనంగా 'E' అనే అక్షరం దర్శనమిచ్చింది. దీంతో చిరు MEGASTAR CHIRANJEEVIకి బదులుగా MEGASTAR CHIRANJEEEVI అని మార్చుకున్నట్లు పుకార్లు రచ్చ చేశాయి. అంతేకాకుండా ఈ పేరు మార్పు వెనకాల న్యూమరాలజిస్టుల సలహా ఉందని, అందుకే చిరంజీవి పేరు మార్చుకున్నట్లు నెట్టింట వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే ఈ వార్తలను చిరంజీవి సన్నిహితులు, గాడ్‌ ఫాదర్‌ చిత్రబృందం ఖండిస్తున్నారు. 

చదవండి: మిస్‌ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం

గాడ్‌ ఫాదర్‌ మూవీ యూనిట్‌ ఎడిటింగ్‌ చేసేటప్పుడు జరిగిన తప్పు మాత్రమే అని, చిరంజీవి ఎలాంటి పేరు మార్చుకులేదని చెబుతున్నారు. ఎడిటింగ్‌ తప్పిదం వల్లే అదనంగా ఇంకో E అక్షరం యాడ్‌ అయిందే తప్ప న్యూమరాలజిస్ట్‌ల సలహా అస్సలు తీసుకోలేదని తెలిపారు. అలాగే మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని చిత్రబృందం పేర్కొంది. అయితే ఈ వార్తపై చిరంజీవి క్లారిటీ ఇస్తే బాగుంటుందని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.   

చదవండి: కేన్సర్‌తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్‌ నటుడు మృతి

మరిన్ని వార్తలు