నెక్స్ట్ సినిమా లీక్‌ చేసిన చిరంజీవి..

8 Feb, 2021 13:24 IST|Sakshi

చాలా గ్యాప్‌ తరువాత మెగాస్టార్‌ చిరంజీవి ఖైదీ నెం 150 సినిమాతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన చిరంజీవికి ఖైదీ చిత్రం విజయాన్ని అందించి కమ్‌బ్యాక్‌ ఇచ్చింది. ఖైదీ అనంతరం 151 చిత్రంగా వచ్చిన సైరా నర్సింహరెడ్డి కూడా బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ కొట్టగా ప్రస్తుతం ఆచార్య సినిమాతో చిరంజీవి బిజీగా ఉన్నాడు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆచార్య తరువాత మలయాళ చిత్రం లూసిఫర్‌ రీమెక్‌లో నటించనున్నాడు. మోహన్‌ రాజా డైరెక్ట్‌ చేయనున్న ఈ సినిమాలో చిరంజీవికి సోదరిగా లేడీ సూపర్‌స్టార్‌ నయనతార నటించనున్నారు.

కాగా రెండు సినిమాలు చేతిలో ఉండగానే చిరంజీవి మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు. దర్శకుడు కేఎస్‌ రవీంద్రతతో(బాబీ) తన 154వ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్లుచ చిరంజీవి స్వయంగా ప్రకటించాడు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఉప్పెన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లూసిఫర్‌ తరువాత బాబీతో ఓ సినిమా చేయనున్నట్లు తెలిపాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ దీనిని నిర్మించనుందని పేర్కొన్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే బాబీ, అతని టీమ్‌ చిరంజీవికి స్క్రిప్ట్ తయారు చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. అనుకున్నట్లు అన్ని సవ్యంగా జరిగితే ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉంది.
చదవండి: తమిళ చిత్రానికి అంతర్జాతీయ గౌరవం..
నోరుపారేసుకున్న నెటిజన్‌.. అనసూయ గట్టి కౌంటర్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు