Chiranjeevi : తారకరత్న ఆరోగ్యంపై ఎమోషనల్‌ పోస్ట్‌ చేసిన చిరంజీవి

31 Jan, 2023 09:36 IST|Sakshi

సినీ నటుడు నందమూరి తారకరత్న బెంగళూరు హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసిన వైద్యులు తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలిపింది. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే తాజాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్‌ చిరంజీవి ఊరటనిచ్చే విషయం చెప్పారు.

ట్విట్టర్‌ వేదికగా స్పందించిన ఆయన తారకరతన్న కోలుకుంటున్నారని తెలిసి తనకు చాలా సంతోషం కలిగిందన్నారు. ‘‘సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు.. ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ.. ఈ పరిస్థితి నుండి తారకరత్నను కాపాడిన ఆ డాక్టర్లకి, భగవంతుడికి కృతజ్ఞతలు.

నువ్వు నిండు నూరేళ్లు.. ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను మై డియర్‌ తారకరత్న’’ అంటూ చిరు ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం చిరు షేర్‌ చేసిన ఈ పోస్ట్‌తో నెట్టింట వైరల్‌గా మారింది. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు