తెలంగాణ ఆడపడుచులకు చిరంజీవి శుభాకాంక్షలు

6 Oct, 2021 13:11 IST|Sakshi

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలను ప్రతిబింబించే బతుకమ్మ సంబురాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి.  తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు పూల పండుగతో సందడి చేయనున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే ఈ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. బ‌తుక‌మ్మ పండుగ ప్రారంభం సంద‌ర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి తెలంగాణ ఆడపడుచులకు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 

‘ఆశ్వయుజ మాసంలో 9 రోజుల బొద్దెమ్మ తర్వాత వచ్చే తెలంగాణ ఆడపడుచు ' బతుకమ్మ' కు స్వాగతం. 9 రోజుల పాటు సాయంత్రం కాగానే వివిధ పుష్పాలతో తీరుగా తీర్చిదిద్దే బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచులు చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం.ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు’అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు