సామ్‌ చిలిపి ప్రశ్న.. చిరు అదిరిపోయే ఆన్సర్‌

20 Dec, 2020 20:36 IST|Sakshi

అక్కినేని కోడలు స‌మంత హోస్ట్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. సామ్ జామ్ పేరుతో 'ఆహా' ఓటీటీ వేదికపై నిర్వహిస్తున్న ఈ షోలో ఇప్పటికే ప‌లువురు సెల‌బ్రిటీలు పాల్గొన్నారు. సమంత హోస్ట్‌గా చేసిన ఈ షోలో  విజయ్ దేవరకొండ తొలి గెస్ట్‌గా హాజరై అలరించాడు . ఆ తర్వాత రానా, త‌మ‌న్నా, ర‌కుల్ ప్రీత్ సింగ్, నాగ్ అశ్విన్, క్రిష్ తదితరులు ఈ ప్రోగ్రామ్‌కి వచ్చి సందడి చేశారు.త్వరలో మెగాస్టార్ చిరంజీవి ఈ షోలో సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన షూటింగ్ పూర్తైయింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేయనున్నట్టు ఓ వీడియోను పంచుకున్నారు.ఇందులో భాగంగా సమంత ..చిరంజీవిని ఓ చిలిపి ప్రశ్న వేసింది. అదేమిటంటే మీ ఫ్రిజ్‌లో ఎపుడు ఉండే ఓ ఐటెమ్ ఏమిటి ? అని చిరంజీవి ప్రశ్నించింది. దానికి మెగాస్టార్ అంతే స్పాంటేనియస్‌గా కొంటే సమాధామిచ్చారు.

 దీనికి చిరంజీవి ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్స్‌తో ప్రేక్ష‌కుల‌తో పాటు స‌మంత గ‌ట్టిగా కేకలు పెట్టేశారు. వెంట‌నే స్పందించిన చిరు ..  మీరు అనుకున్నది కాదు అస్సలు కానేకాదు అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ప్రోమో వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. కాగా ఈ ఎపిసోడ్ డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ఆహా ఓటీటీలో విడుదల కానుంది. ఈ షోలో చిరంజీవి తన పర్సనల్ లైఫ్‌‌కు సంబంధించిన విషయాలను పంచుకోనున్నారు. 

మరిన్ని వార్తలు