God Father Digital Rights: చిరంజీవి 'గాడ్‌ ఫాదర్' డిజిటల్ రైట్స్‌ ఎన్ని కోట్లంటే?

20 Sep, 2022 15:57 IST|Sakshi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. నయనతార, సత్యదేవ్, సల్మాన్‌ఖాన్‌, బ్రహ్మాజీ, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ ఫ‍్యాన్సీ ధరకే విక్రయించినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ డిజిటల్‌ రైట్స్‌ను దక్కించుకున్నట్లు సమాచారం. తెలుగు, హిందీలో కలిపి నెట్‌ఫ్లిక్స్‌ రూ.57 కోట్లు చెల్లించినట్లు సినీ వర్గాలు అంటున్నాయి.

 ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దసరా కానుకగా వచ్చేనెల 5న ఈ సినిమా విడుదల చేయనున్నారు. రాయలసీమలోని అనంతపురం వేదికగా ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈవెంట్‌ ఎప్పుడు నిర్వహిస్తారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రల్లో వచ్చిన మలయాళ సూపర్‌హిట్‌ ‘లూసిఫర్‌’ తెలుగులో రీమేక్‌గా వస్తోంది‘. ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ తీసుకొచ్చేందుకు పృథ్వీరాజ్‌ పోషించిన పాత్రను తెలుగులో సల్మాన్‌తో చేయిస్తున్నారు. చిరంజీవి సోదరి పాత్రలో నయనతార కనిపించనుండగా.. విలన్ పాత్రలో సత్యదేవ్‌ నటిస్తున్నారు. 

మరిన్ని వార్తలు