Pakka Commercial: పక్కా కమర్షియల్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా చిరంజీవి!

22 Jun, 2022 20:15 IST|Sakshi

గోపీచంద్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 26న హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు వినికిడి.

ఇకపోతే ‘‘రణం’, ‘లౌక్యం’ తర్వాత మళ్లీ అంత ఫన్‌ ఉన్న సినిమా చేశానని ఇటీవల గోపీచంద్‌ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘పక్కా కమర్షియల్‌’ కథలో హ్యూమర్‌కు మంచి స్కోప్‌ ఉందని, మారుతి రాసిన కథకు న్యాయం చేశాననే అనుకుంటున్నానని పేర్కొన్నాడు. అటు రాశీ ఖన్నా సైతం ఈ సినిమా తనకెంతో ప్రత్యేకం అని చెప్పుకొచ్చింది. ‘ప్రతిరోజూ పండగ’ చిత్రంలో చేసిన ఏంజెల్‌ ఆర్నా పాత్రకు రెండు రెట్ల వినోదం ఈ సినిమాలో ఉంటుందని తెలిపింది.

చదవండి: ఓటీటీలో చేయను, ఎప్పటికీ నేను బిగ్‌ స్క్రీన్‌ హీరోనే!
 ఇంజనీర్‌ను పెళ్లాడిన బుల్లితెర బ్యూటీ

మరిన్ని వార్తలు