జోరు పెంచిన మెగాస్టార్‌..మరో యంగ్‌ డైరెక్టర్‌కి గ్రీన్‌ సిగ్నల్‌

21 Nov, 2021 05:34 IST|Sakshi

మంచి దూకుడు మీద ఉన్నారు చిరంజీవి. వరుసగా సినిమాలు కమిట్‌ అవుతున్నారు. ఇప్పటికే ‘గాడ్‌ఫాదర్‌’, ‘బోళాశంకర్‌’, దర్శకుడు బాబీతో సినిమాలు కమిట్‌ అయిన చిరంజీవి తాజాగా మరో కొత్త సినిమా అంగీకరించారని తెలిసింది. ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలను తెరకెక్కించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తారని భోగట్టా. ఆల్రెడీ చిరంజీవికి వెంకీ స్టోరీలైన్‌ వినిపించారట. ఈ సినిమా గురించి త్వరలో అధికారక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు