Chiranjeevi-Editor Gautham Raju: ఎడిటర్‌ కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 2 లక్షలు ఇచ్చిన చిరు

6 Jul, 2022 15:06 IST|Sakshi

సినీ ఎడిటర్‌ గౌతమ్‌రాజు (68) అనారోగ్యంతో బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న నగరంలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే ఒక్కసారిగా అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 1:30 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి టాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలుపుతు గౌతమ్‌ రాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. అలాగే మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా గౌతమ్‌రాజు మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అంతేకాదు ఆయన కుటుంబ సభ్యులకు తక్షణ సాయం కింద తాజాగా 2 లక్షల రూపాయలను ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ద్వారా అందజేశారు.

చదవండి: బాలీవుడ్‌ స్టార్‌ హీరోకు విలన్‌గా విజయ్‌ సేతుపతి?

ఈ మేరకు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రెండు లక్షల రూపాయలను ఎడిటర్ గౌతమ్ రాజు కుటుంబ సభ్యులకు ఇచ్చారు. అనంతరం వారికి అండగా ఉంటామని, ధైర్యం కోల్పోవద్దని చిరు కుటుంబం తరపున ఆయన కుటుంబానికి ధైర్యం ఇచ్చారు. ఇది విషయాన్ని తమ్మారెడ్డి మీడియాకు వెల్లడించారు. కాగా గౌతమ్‌ రాజు ఎడిటర్‌గా 800లకు పైగా చిత్రాలకు పనిచేశారు. సినీ ఇండస్ట్రీలో ఆయనకు చిరంజీవితో మంచి అనుబంధం ఉంది. చిరు సినిమాలైన ‘చట్టానికి కళ్లు లేవు’ చిత్రం నుంచి ‘ఖైదీ నం.150’ వరకు తన ఎన్నో చిత్రాలకు గౌతమ్‌ రాజు ఎడిటర్‌గా పనిచేసినట్లు చిరు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు