విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 100వ జయంతి నేడు(మే 28). ఈ సందర్భంగా పలువురు సీనీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పించారు. ‘తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు,నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు.ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి’అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశాడు.
(చదవండి: పదే పదే తలచు తెలుగుజాతి)
ఇక రామరావు జయంతి సందర్భంగా తాతను స్మరించుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోందని, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోందని, పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా’ అంటూ ఎన్టీఆర్ ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టాడు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం ఎన్టీఆర్ను స్మరించుకుంటూ పోస్టులు పెట్టారు.
తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు,నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు.ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి! #100YearsOfNTR
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2022
సదా మిమ్మల్ని స్మరించుకుంటూ… pic.twitter.com/svo2SUQSlP
— Jr NTR (@tarak9999) May 28, 2022
కారణ జననానికి వందేళ్ళు !!
నటుడిగా అలరించి, అబ్బుర పరచి..
అఖండ ఖ్యాతినార్జించారు!నాయకుడిగా అండనిచ్చి, అభివృద్ధినందించి..
ఆదర్శప్రాయుడయ్యారు!!వ్యక్తిగా ఆత్మగౌరవానికి నిలువెత్తురూపంగా నిలిచారు!!
తెలుగువారి గుండెల్లో మీ స్థానం..
— Sreenu Vaitla (@SreenuVaitla) May 28, 2022
సుస్థిరం.. సమున్నతం.. శాశ్వతం!!#100YearsOfNTR pic.twitter.com/f5ErLiNpJE
Some saw him as an ordinary man..Some saw him as a God..but,in the end everybody realised that he was a Man sent by God!
The Pride of every Telugu soul! 🙏❤️ #100YearsOfNTR
Love..#RAPO pic.twitter.com/tl0WzA8Qsp
— RAm POthineni (@ramsayz) May 28, 2022
The man of the people and for the people. #NTR garu's good deeds and service will never be forgotten on and off the screen. We are forever grateful to this legend!
Let us come together and celebrate his achievements and greatness!https://t.co/GdiBeUh89M pic.twitter.com/eBgLuTyvex
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 26, 2022
Johar NTR. #100YearsOfNTR pic.twitter.com/uRRpsRbHzV
— Raghavendra Rao K (@Ragavendraraoba) May 28, 2022