మంగ్లీ పాటను లాంచ్ చేసిన మెగాస్టార్‌

2 Apr, 2021 14:52 IST|Sakshi

ప్రముఖ గాయని మంగ్లీ పాడిన ‘యోగితత్వం’ పాటను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. దాము రెడ్డి దర్శకత్వం వహించిన ఈ పాటకు బాజి సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటను అచలయోగి, సంకీర్తనాచార్యులు, తత్వవేత్త, రచయిత, హరికథ గాన సంపన్నుడైన మల్కిదాస్ తత్వసంకీర్తన నుంచి సేకరించినది. ‘నా గురుడు నన్నింకా యోగి గమ్మననె’ అంటూ సాగే ఈ పాటలో యోగితత్వాన్ని అద్భుతంగా వివరించారు. ప్రస్తుతం ఈ పాట సంగీత ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు