ఆది లుక్‌ బాగుంది

24 Dec, 2020 05:49 IST|Sakshi
సాయికుమార్, చిరంజీవి, ఆది, శ్రీనివాస్‌ నాయుడు, ఆర్‌.పి. వర్మ

– చిరంజీవి

‘‘నేను, సాయికుమార్‌ కలిసి సినిమాలు చేస్తున్నప్పుడు ఆది పుట్టాడు. ‘శశి’ టీజర్‌ చూస్తుంటే రగ్డ్‌ లవ్‌ స్టోరీలా అనిపిస్తోంది. ఇప్పటివరకూ ఆది లవర్‌ బాయ్‌లా కనిపించాడు. ఈ టీజర్‌లో తన ట్రాన్స్‌ఫర్మేషన్‌ని అభినందిస్తున్నా’’ అన్నారు చిరంజీవి. ఆది సాయికుమార్‌ హీరోగా శ్రీనివాస్‌ నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఆర్‌.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం ‘శశి’. బుధవారం ఆది సాయికుమార్‌ బర్త్‌డే సందర్భంగా ‘శశి’ టీజర్‌ని చిరంజీవి విడుదల చేశారు. ‘‘శశి’ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ’’ అన్నారు ఆది సాయికుమార్‌. ‘‘ఆది తొలి సినిమా ‘ప్రేమ కావాలి’కి అన్నయ్య చిరంజీవి విషెస్‌ లభించాయి. ఇప్పుడు ‘శశి’ టీజర్‌ను ఆయన లాంచ్‌ చేసి, బ్లెస్సింగ్స్‌ ఇవ్వడం ఆనందంగా ఉంది’’ అన్నారు నటుడు సాయికుమార్‌.
 

మరిన్ని వార్తలు