Chiranjeevi : పూనకాలు లోడింగ్‌.. అభిమానులతో లైవ్‌లో ముచ్చటించిన చిరు

24 Jan, 2023 12:10 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా బరిలోకి దిగిన చిరు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించారు. వాల్తేరు వీరయ్యగా అటు క్లాస్‌, ఇటు మాస్‌ ఆడియెన్స్‌ను ఫుల్లుగా ఎంటర్‌టైన్‌ చేశారు. మూవీ రిలీజ్‌ అయిన తొలిరోజు నుంచే సక్సెస్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 200కోట్లకు పైగా కలెక్షన్లకు రాబట్టింది.

చిరంజీవి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన వాల్తేరు వీరయ్య ఇంకా బాక్సాఫీస్‌ వద్ద ఊచకోత సృష్టిస్తోంది. చిరు స్టామినా ఏమాత్ర తగ్గలేదంటూ మెగా ఫ్యాన్స్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ హోరెత్తిస్తున్నారు. ఇక అమెరికాలో సైతం మెగా ఫ్యాన్స్‌ ఈ సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో చిరు లైవ్‌లో ఉన్నప్పుడే కేక్‌ కట్‌ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు.

లాస్‌ ఏంజెల్స్‌, ఫీనిక్స్‌, డెన్వర్‌, షికాగో, డాలస్‌, హ్యూస్టన్‌ సహా 27 అమెరికన్‌ సిటీస్‌ ప్రాంతాలకు చెందిన అభిమానులతో చిరు లైవ్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా అభిమానుల కేకలు, సంతోషం చూసి కాస్త ఎమోషనల్‌ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు