మీరు లేకుండా నేను లేను నాన్నా..మహేశ్‌బాబు ఎమోషనల్‌ పోస్ట్‌

19 Jun, 2022 13:51 IST|Sakshi

ఫాదర్స్‌ డే స్పెషల్‌.. తండ్రితో జ్ఞాపకాలను షేర్‌ చేసుకున్న సెలెబ్రిటీస్‌

నేడు ఫాదర్స్‌ డే (జూన్‌ 19). ఈ సందర్భంగా టాలీవుడ్‌కి చెందిన పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఒక గొప్ప కొడుకుగా, గర్వించదగ్గ తండ్రిగా మధురమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నాను అని మెగాస్టార్‌ చిరంజీవి అనారు. ఈ మేరకు ఆదివారం ఉదయం తండ్రి వెంకట్రావ్‌తో దిగిన ఫోటోని ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కూడా నాన్న కృష్ణకు ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు తెలుపుతూ..‘నాన్న అనే పదానికి నాకు సరైన నిర్వచనం తెలియజేశారు. మీరు లేకుండా నేను లేను. హ్యాపీ ఫాదర్స్‌డే నాన్న’అని మహేశ్‌ ట్వీట్‌ చేశాడు.

‘నాన్న నువ్వు నాకోసం తీసుకున్నా ప్రతి నిర్ణయం ప్రతి కష్టం ప్రతి శ్రమ ప్రతి అడుగు నా మదిలో వెంటాడుతూనే ఉంటాయి ఐ లవ్ యు నాన్న’అని నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ ట్వీట్‌ చేశాడు. 

A post shared by Nihaa Konidela (@niharikakonidela)

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni)

మరిన్ని వార్తలు