సీఎం కేసీఆర్‌కు చిరంజీవి, మహేశ్‌ స్పెషల్‌ విషెస్‌

17 Feb, 2023 10:40 IST|Sakshi

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బర్త్‌డే నేడు(ఫిబ్రవరి 17). ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి ట్విటర్‌ వేదికగా కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ‘ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు సుదీర్ఘమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలి’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కూడా కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పారు. ‘గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వచ్చే ఏడాది మీ జీవితం మరింత అద్భుతంగా సాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అని మహేశ్‌ ట్వీట్‌ చేశాడు. 

మరిన్ని వార్తలు