కష్టంలో కలిసి నడవాలంటున్న చిరంజీవి

21 Apr, 2021 11:52 IST|Sakshi

ఏ పండుగ అయినా సినీ ఇండస్ట్రీలో కోలహాలం కనిపించేది. పండగ రోజు ప్రత్యేక పోస్టర్లు రిలీజ్‌ చేస్తూ ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్‌ ఇచ్చేవారు. కానీ కరోనా వల్ల ఆల్‌రెడీ రెడీగా ఇప్పటికే పలు సినిమాలు వాయిదా పడగా, మరికొన్నింటి షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. అయినా సరే.. పండగను మిస్‌ అవ్వమని, అందులోనూ శ్రీరామనవమి తమకు ప్రత్యేకమే అంటోంది సినీ ఇండస్ట్రీ. ఈ క్రమంలో పలువురు సినీతారలు, నిర్మాణ సంస్థలు అభిమానులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

'హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది- రామతత్వం! కష్టంలో కలిసి నడవాలన్నది- సీతాతత్వం! అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. పుణ్య దంపతులైన సీతారాముల శుభాశీస్సులతో మనందరి మనసులు ఎప్పుడూ మంచి ఆలోచనలతో నిండాలని ఆశిస్తున్నాను' అని ట్వీట్‌ చేశారు మెగాస్టార్‌ చిరంజీవి. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, మాస్‌ మహారాజ రవితేజ వంటి హీరోలు రామనవమి శుభాకాంక్షలు చెప్తూనే ఇంట్లో సేఫ్‌గా ఉండాలని కోరారు.

ఆనాడు లక్ష్మణరేఖ దాటిన సీతమ్మ తల్లి ఎన్నో అష్టకష్టాలు పడి చివరికి శ్రీరాముని వల్ల రావణుని చెర వీడింది. ఈనాడు కరోనా జాగ్రత్తలు తీసుకున్నా ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు.. అని మోహన్‌బాబు రాసుకొచ్చాడు.

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

చదవండి: శ్రీరామనవమి ఇంట్లో ఎలా జరుపుకోవాలో తెలుసా?

సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలూ...

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు