Chiranjeevi : బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌కు ఆతిథ్యం ఇచ్చిన చిరు

1 Nov, 2022 16:46 IST|Sakshi

బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ను మెగాస్టార్‌ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరు నివాసంలోనే ఓవెన్‌కు అతిథ్యం ఇచ్చారు. ఈ భేటీలో బ్రిటన్‌, భారత్‌ సహా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలను చర్చించుకున్నట్లు స్వయంగా చిరంజీవి ట్వీట్‌ చేశారు.

'బ్రిటన్‌ నూతన డిప్యూటీ కమిషనర్‌తో భేటీ కావడం ఆనందంగా ఉంది. నా నివాసంలో ఆయనకు కొన్ని తెలుగు సంప్రదాయ వంటకాలతో విందు ఏర్పాటు చేశాను. నోరూరించే ఆవకాయ కూడా రుచి చూశారు' అంటూ చిరు పేర్కొన్నారు. భేటికి సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్‌ చేశారు.

  కాగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్‌గా వ్యవహరించారు. ఫ్లెమింగ్ పదవీకాలం జులైలో ముగియగా, ఆయన స్థానంలో గారెత్ విన్ ఓవెన్ నూతన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా నియమితులైన సంగతి తెలిసిందే. 


 

మరిన్ని వార్తలు