అభిమానుల ప్రేమ, ఆద‌ర‌ణ మాకు గొప్ప ఎన‌ర్జీ: చిరంజీవి

27 Aug, 2021 19:45 IST|Sakshi

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు ఆగ‌స్టు 22న జ‌రిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుక‌ల్లో ఆయ‌న‌కు విషెస్ తెలిపేందుకు తిరుప‌తి అలిపిరి నుంచి ఓ వీరాభిమాని సైకిల్ యాత్ర చేప‌ట్టి 12రోజులు ప్ర‌యాణించ‌డం ఆశ్చ‌ర్య‌పరిచింది. ఈ సంద‌ర్భంగా చిరంజీవి త‌న‌ను క‌లిసేందుకు అభిమానికి అంత శ‌క్తి ఎలా వ‌చ్చిందో అంటూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ సాహ‌సం స‌రికాద‌ని వారించారు.

చదవండి: రోడ్డుపై కనువిందు చేస్తున్న ఎన్టీఆర్‌ లంబోర్ఘిని, చరణ్‌ ఫెరారీ..

అభిమానుల ఆశీస్సులతోనే మేం బావుంటాం..
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘నా అభిమాని ఎన్. ఈశ్వ‌ర‌య్యా బ‌లుజుప‌ల్లి గ్రామం నుంచి వ‌చ్చాడు. తిరుప‌తి(అలిపిరి) నుంచి అత‌డు సైకిల్పై ప్ర‌యాణం ప్రారంభించాడు. నా పుట్టిన‌ రోజు కోసం అత‌డు సైకిల్ యాత్రను చేప‌ట్టి వ‌చ్చి క‌లిశాడు. నా ఆరాధ్య దైవం ఆంజ‌నేయ స్వామి మాల‌ను ధ‌రించి స్వామి ఆశీస్సులు మాకు ఉండాల‌ని కోరుకున్నారు. మేం ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని ఆలోచిస్తూ వ‌చ్చారు.

ఆగ‌స్టు 10న‌ బ‌య‌ల్దేరి 12 రోజుల పాటు 1200 కిమీ సైకిల్ యాత్ర చేసుకుంటూ అలిపిరి నుంచి వ‌చ్చారాయన. చాలా సంద‌ర్భాల్లో చెప్పాను. మాకు అభిమానుల ప్రేమ ఆద‌ర‌ణ గొప్ప ఎన‌ర్జీ. ఇలాంటి అభిమానుల మంచి మ‌న‌సు ఆశీస్సులతోనే మేం బావుంటాం. వారు మా గురించి ఆలోచించిన‌ట్టే మేం కూడా వారు వారి కుటుంబ స‌భ్యులు బావుండాల‌ని కోరుకుంటూ బెస్ట్ విషెస్ తెలియ‌జేస్తున్నాను’ అని అన్నారు. అలాగే త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ని క‌ల‌వాల‌ని అడిగిన ఆ అభిమానికి క‌లిసేందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేశారు మెగాస్టార్ చిరంజీవి. 

చదవండి: ‘ఇచ్చట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ మూవీ రివ్యూ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు