చిరంజీవి ఇమేజ్‌కి తగ్గట్టుగా... 

21 Jan, 2021 07:56 IST|Sakshi
మోహన్‌రాజా, చిరంజీవి, ఆర్‌.బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్‌

చిరంజీవి తాజా చిత్రం ప్రారంభమైంది. కొణిదెల ప్రొడక్షన్స్‌పై సురేఖ కొణిదెల సమర్పణలో ఈ చిత్రాన్ని ఆర్‌.బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మలయాళంలో మోహన్‌లాల్‌ హీరోగా నటించిన సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ ‘లూసిఫర్‌’ ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘ఫిబ్రవరిలో ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్ట్‌ను తయారు చేశారు దర్శకుడు మోహన్‌రాజా’’ అన్నారు.

మోహన్‌రాజా మాట్లాడుతూ.. ‘‘మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా చేసే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఫ్యాన్స్‌ కోరుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఇది పూర్తి స్థాయి రీమేక్‌ సినిమా కాదు. ఒరిజినల్‌ పాయింట్‌ తీసుకుని చిరంజీవిగారి ఇమేజ్‌కి తగ్గట్టుగా కథను మార్చి, తెరకెక్కిస్తాను’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, అశ్వినీదత్, డీవీవీ దానయ్యలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యస్‌.యస్‌. తమన్‌.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు