వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై చిరంజీవి ప్రశంసల జల్లు

22 Jun, 2021 12:24 IST|Sakshi
చిరంజీవి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ( ఫైల్‌ ఫోటో )

ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ చేపట్టడం పట్ల మెగాస్టార్‌ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఓకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. కోవిడ్‌ మహమ్మారి కట్టడి కోసం ఏపీ  వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రయత్నాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభినందించారు. కోవిడ్‌ నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు. 

కాగా, కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం ఆదివారం ఒక్కరోజే 13 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ అందించారు. వాస్తవానికి ఒక్క రోజు 8 లక్షల మంది వ్యాక్సిన్ వేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. దాన్ని అధిగమిస్తూ.. ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేశారు. ఉదయం ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం ఒక ఉద్యమంగా ప్రజలకు చేరువ చేశారు.

ఇక్కడ చదవండి: మహిళల ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ: సీఎం జగన్‌ 
మన సత్తా చాటారు: సీఎం వైఎస్‌ జగన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు