Chiranjeevi: చిరు సమర్పణలో నాగ చైతన్య హిందీ చిత్రం..

16 Jul, 2022 20:36 IST|Sakshi

పాత్రకు తగిన ఆహార్యం, నటనతో మెప్పిస్తాడు బాలీవుడ్ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌. 57 ఏళ్ల వయసులో ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'లాల్‌సింగ్‌ చద్దా'. హాలీవుడ్‌ మూవీ 'ఫారెస్ట్‌ గంప్‌'కు రీమేక్‌గా వస్తున్న ఈ  చిత్రంలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటివరకు ఈ మూవీ హిందీలో మాత్రమే వస్తున్నట్లు తెలుసు. అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్‌ కూడా రాబోతుంది. 

ఈ తెలుగు వెర్షన్‌ను మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేయనున్నారు. చిరంజీవి సమర్పణలో 'లాల్‌ సింగ్ చద్దా' తెలుగులో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రానుంది. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా చిరంజీవి తెలిపుతూ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల ఈ చిత్రాన్ని అమీర్‌ఖాన్‌తో కలిసి తన నివాసంలో చిరంజీవి స్పెషల్‌గా వీక్షించిన విషయం తెలిసిందే. ఈ సినిమా చిరుకి నచ్చి తెలుగులో విడుదల చేస్తానని అమీర్‌ ఖాన్‌ కోరారు. అందుకు అమీర్ ఖాన్‌ కూడా అంగీకారం తెలపడంతో తెలుగులోనూ రిలీజ్‌ చేయనున్నారు చిరు. 

చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్‌
అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

'ఇది ఒక ఎమోషనల్‌ స్టోరీ. నా ప్రియమిత్రుడు అమీర్‌ ఖాన్‌ నటించిన లాల్‌ సింగ్‌ చద్దా చిత్రాన్ని తెలుగు వెర్షన్‌లో విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది' అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. 

చదవండి: చోర్ బజార్‌లో రూ.100 పెట్టి జాకెట్‌ కొన్నా: స్టార్‌ హీరో

మరిన్ని వార్తలు