Chiranjeevi: నెల రోజుల హాలిడే తర్వాత ఇంటికి చేరిన చిరంజీవి..

4 Jun, 2022 04:24 IST|Sakshi

చిరంజీవి బ్యాక్‌ టు హోమ్‌. గత నెల 3న తన సతీమణి సురేఖతో కలిసి చిరంజీవి విదేశాలకు విహార యాత్రకు వెళ్లారు. నెల రోజుల హాలిడే తర్వాత శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు. వెకేషన్‌లో ఫుల్‌గా రిలాక్స్‌ అయిన చిరంజీవి ఇక షూటింగ్స్‌తో బిజీ కానున్నారు.

ప్రస్తుతం మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ‘బోళా శంకర్‌’, బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’, మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. ఈ మూడు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొనడానికి ప్లాన్‌ చేసుకున్నారు. ‘గాడ్‌ ఫాదర్‌’లోని ఓ సాంగ్‌ సీక్వెన్స్, ‘బోళా శంకర్‌’ షూట్, ‘వాల్తేరు వీరయ్య’ ఫారిన్‌ షెడ్యూల్‌లో చిరంజీవి పాల్గొంటారట. ఇక ఈ రెండు సినిమాలే కాక.. చిరంజీవి హీరోగా ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాల ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. 

చదవండి: చిరంజీవితో ఏ గొడవ లేదు.. వారే దూరం పెంచుతున్నారు: జీవిత
ఆ సినిమా నా కంటే వెంకటేశ్‌ చేస్తేనే బాగుండేది : చిరంజీవి

మరిన్ని వార్తలు