సాయిధరమ్‌తేజ్‌ కోలుకుంటున్నారు: చిరంజీవి

11 Sep, 2021 07:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అభిమానులు ఆందోళన పడవద్దని.. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో సాయిధరమ్‌తేజ్‌ కోలుకుంటున్నారని మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు.. రెండు రోజుల్లో సాయిధరమ్‌ తేజ్‌ తిరిగి వస్తాడని చిరంజీవి పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో సాయిధరమ్‌తేజ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేనల్లుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారన్న సమాచారంతో శుక్రవారం రాత్రి చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, అల్లు అరవింద్ వెంటనే మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి వచ్చారు.

మెడికవర్ ఆసుపత్రి వైద్యులను అడిగి సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సాయితేజ్ కోలుకుంటున్నాడని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. మెరుగైన వైద్యం కోసం మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రి నుండి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి సాయిధరమ్‌తేజ్‌ను తరలించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

సాయిధరమ్‌తేజ్‌ ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసిన వైద్యులు
 రోడ్డు ప్రమాదంలో హీరో సాయి ధరమ్‌ తేజ్‌కు తీవ్రగాయాలు

మరిన్ని వార్తలు