Chiranjeevi: ఆమె సైకిల్‌ పట్టుకుంటే నేను తొక్కేవాడిని: చిరంజీవి

31 Jul, 2022 20:17 IST|Sakshi

Chiranjeevi Says He Fell In Love At 7th Standard: బాలీవుడ్ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమిర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ జోడిగా నటించిన చిత్రం 'లాల్‌సింగ్‌ చద్దా'. సూపర్‌ హిట్టయిన హాలీవుడ్‌ మూవీ 'ఫారెస్ట్‌ గంప్‌'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ గుడ్‌ బాయ్‌ నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ పాపులర్ డైరెక్టర్‌ అద్వైత్ చందన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకులను పలకరించనుంది. అలాగే తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి సమర్పిస్తున్న ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ ఇటీవల విడుదల కాగా మంచి రెస్పాన్స్‌ అందుకుంటోంది. మూవీ విడుదల తేది దగ్గరపడనుండటంతో సినిమా ప్రమోషన్స్‌లో వేగం పెంచింది చిత్రబృందం.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవి, అమీర్ ఖాన్‌, నాగ చైతన్యలను టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇంటర్వ్యూ చేశారు. త్వరలో టెలీకాస్ట్‌ కానున్న ఈ ఇంటర్వ్యూ ప్రొమోను విడుదల చేశారు. ఈ ప్రొమోలో ఎన్నో ఆసక్తికర విషయాలను, నవ్వులను పంచుకున్నారు. 'లాల్ సింగ్‌ చద్దాలో అమీర్‌ ఖాన్ ఒక చిన్న పిల్లాడిలా, కాలేజ్‌ స్టూడంట్‌లా, ఆర్మీ ఆఫీసర్‌లా కనిపిస్తారు. ఈ టాన్స్ఫర్మేషన్‌ ఎలా జరిగింది' అని నాగార్జున ప్రశ్నించారు. దానికి వీఎఫ్‌ఎక్స్‌ వాళ్లు అంతా చేశారని అమీర్‌ ఖాన్‌ చెప్పగా.. 'ఈ మాటలు ఎడిట్‌ చేయండి' అని చిరంజీవి చెప్పడం సరదాగా ఉంది. 

చదవండి:  ప్రియుడితో బర్త్‌డే వేడుకలు!.. ఫొటోలతో దొరికిపోయిన హీరోయిన్‌

ఈ క్రమంలోనే 'ఈ సినిమాలో పదేళ్ల వయసులోనే హీరో ప్రేమలో పడతాడు' అని నాగార్జున అన్న వెంటనే.. 'మీరు తొలిసారి ఎప్పుడు ప్రేమలో పడ్డారు?' అని చిరుని అమీర్‌ ఖాన్‌ అడుగుతారు. అప్పుడు చిరంజీవి 'ఏడో తరగతిలో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డాను. ఒక అమ్మాయి సైకిల్‌ తొక్కడం అంటే మా మొగల్తూరులో చాలా ఆశ్చర్యంగా ఉండేది. అలాంటిది ఆ అమ్మాయి పట్టుకుంటే నేను సైకిల్‌ తొక్కేవాడిని. అప్పుడు సైకిల్‌ తొక్కడంపై కాన్సంట్రేషన్‌ పక్కన పెట్టి ఆమెను చూసేవాన్ని. అప్పుడు ఆమె ముందు చూడు అంటూ నా ముఖాన్ని ముందుకు తిప్పేది' అని తెలిపారు. 

చదవండి: కాజోల్‌ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. అజయ్‌ దేవగణ్‌ స్పెషల్‌ పోస్ట్‌

అలాగే చిరంజీవితో సినిమా చేయాలని ఉందని అమీర్ ఖాన్‌ తెలిపారు. మెగాస్టార్‌తో డైరెక్షన్‌, లేదా ప్రొడక్షన్‌లో సినిమా చేస్తానని అమీర్ అన్నారు. అప్పుడు చిరంజీవి 'టేక్‌ వన్‌ ఓకే కాదు కదా..' అని అనండతో అమీర్‌ నవ్వేశారు. తర్వాత 'ప్రొడక్షన్‌ ఓకే. డైరెక్షన్‌ మాత్రం ఒప్పుకోవద్దు' అని నాగార్జున సలహా ఇచ్చారు. ఈ క్రమంలోనే అమీర్ ఖాన్‌ చిత్రాల్లో ఏదైనా రీమేక్‌ చేయాలంటే ఏ సినిమా తీస్తారు అని చిరంజీవిని అడిగిన ప్రశ్నకు 'ఏ మూవీ తీయను' అని సమాధానమిచ్చారు. ఇలా ఆద్యంతం నవ్వులతో, ఆసక్తిగా ఈ ప్రొమో సాగింది. మరీ మరిన్ని ఆసక్తికర విషయాలేంటో తెలుసుకోవాలంటే పూర్తి ఇంటర్వ్యూ టెలీకాస్ట్‌ అయ్యేవరకు వేచి చూడాల్సిందే.  

మరిన్ని వార్తలు